రాజధాని పరిధిలోని పేద ప్రజలకు తెదేపా హయాంలో కేటాయించిన ఇళ్లకు ఇప్పటివరకూ పట్టాలు ఇవ్వకపోవడాన్ని తేదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తప్పుపట్టారు. రాజధాని భూములను వైకాపా కార్యకర్తలకు ఇచ్చేందుకు జీవో నెంబర్ 107 జారీ చేశారని ఆరోపించారు. 70రోజుల నుంచి రాజధాని రైతులు దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధాని రైతులకు ఇళ్లపట్టాలు ఇవ్వకపోటం దారుణం - tdp mla angani sathyaprasad fired on ycp govt
రాజధాని గ్రామాల్లో పేద ప్రజలకు కేటాయించిన ఇళ్లకు వైకాపా ప్రభుత్వం ఇప్పటివరకూ పట్టాలు ఇవ్వకపోవటంపై తేదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రభుత్వాన్ని నిలదీశారు. పట్టాలు ఇవ్వకపోవడం సరికాదని, ప్రభుత్వ విపరీత పోకడకు నిదర్శనమే జీవో నెం.107అని విమర్శించారు.
రాజధాని రైతులకు ఇళ్లపట్టాలు ఇవ్వకపోటంపై అనగాని ఆగ్రహం