ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

mla anagani satya prasad: కాపుల సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమా..? - ఎమ్మెల్యే అనగాని - development of Kapu community in ap

వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్వప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు(mla anagani satya prasad fires on ycp govt news). కాపుల సంక్షేమానికి బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. వైకాపా రెండేళ్ల పాలనలో కాపులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.

tdp mla anagani satya prasad
tdp mla anagani satya prasad

By

Published : Oct 14, 2021, 12:12 PM IST

కాపుల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, వైకాపా ఏం చేస్తోందో బహిరంగ చర్చకు సిద్ధమా? అని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సవాల్ విసిరారు(mla anagani satya prasad fires on ycp govt). జగన్ రెడ్డి.. కాపులకు ఇచ్చిన హామీలు ఆకాశంలో ఉంటే, వాటి అమలు మాత్రం పాతాళంలో ఉందని దుయ్యబట్టారు. రెండు దశాబ్దాల్లో కాపులకు ఎన్నడూ జరగని అన్యాయం వైకాపా రెండున్నరేళ్ల పాలనలో జరిగిందని ధ్వజమెత్తారు(development of Kapu community in ap news).

రాజకీయంగా, సామాజికంగా తెదేపా ప్రభుత్వం అన్ని విధాలా గౌరవిస్తే, జగన్ రెడ్డి (cm jagan news)వారి సంక్షేమాన్ని గాలికొదిలేయటంతో పాటు తెదేపా అమలు చేసిన అనేక కార్యక్రమాలు రద్దు చేశారని అనగాని మండిపడ్డారు. కాపు కార్పొరేషన్ ను నిర్వీర్యం చేయటంతో పాటు అందరికీ అందించే పథకాలే కాపులకు అమలు చేస్తూ అవినీతి మూటలు సర్దుకుంటున్నారని దుయ్యబట్టారు. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో కాపులకు తెదేపా ప్రభుత్వం అమలు చేసిన 5శాతం రిజర్వేషన్లను రద్దు చేయటంతో.. కేవలం సచివాలయ ఉద్యోగాల్లోనే 12వేల మంది అవకాశం కోల్పోయారని ఆక్షేపించారు. కాపు భవనాలను నిలిపివేయడంతో పాటు నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు రైతుల్ని కూడా కుల ప్రాతిపదికన విభజించి రైతు భరోసా అందకుండా చేశారని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details