TDP leaders protest: నాటు సారా మరణాలపై వరుసగా మూడోరోజూ లోకేశ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం శాసనసభాపక్షం నిరసన తెలిపింది. జగన్ పాలనలో "సారా అగ్గి సంసారం బుగ్గి" అంటూ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. ముఖ్యమంత్రి మాటలు, పోలీసు ఎఫ్‌ఐఆర్‌లలో ఏది నిజమంటూ నినాదాలు చేశారు.
"జగన్ పాలనలో సారా అగ్గి.. సంసారం బుగ్గి" - ఏపీ లేటెస్ట్ అప్డేట్స్
TDP leaders protest: సారా మరణాలపై మూడో రోజూ తెదేపా శాసనసభాపక్ష నాయకులు నిరసన సాగిస్తున్నారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి శాసనసభ వరకు ర్యాలీ నిర్వహించారు. జగన్ పాలనలో సారా అగ్గి సంసారం బుగ్గి అంటూ ప్లకార్డులను ప్రదర్శంచారు.
తెదేపా శాసనసభాపక్ష నాయకుల నిరసన
TDP leaders protest: జంగారెడ్డిగూడెంలో జరిగినవన్నీ జగన్ రెడ్డి కల్తీసారా మరణాలే అంటూ నినాదించారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి శాసనసభ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా కల్తీసారా వ్యాపారం చేసేది వైకాపా నేతలేనన్నారు. కల్తీసారా మరణాలపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:Spurious Liquor Deaths: జంగారెడ్డిగూడెంలో 19కి చేరిన నాటుసారా మృతుల సంఖ్య