ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి విధ్వంస పాలన సాగిస్తున్నారని.. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తెదేపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ బయట... అగ్నిమాపక కేంద్రం నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాదయాత్రగా శాసనసభకు వెళ్లారు.
అసెంబ్లీకి పాదయాత్రగా తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు - అసెంబ్లీ బయట తెదేపా పాదయాత్ర న్యూస్
వైకాపా ఏడాది పాలన, నేతల అరెస్టులను నిరసిస్తూ తెలుగుదేశం నేతలు అసెంబ్లీ సమావేశాలకు పాదయాత్రగా వెళ్లారు. ఎమ్మెల్సీ నారా లోకేశ్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లిన తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు