వెలుగొండ ప్రాజెక్టును గెజిట్‌లో చేర్చాలని ప్రకాశం, నెల్లూరు తెదేపా నేతల బృందం కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్షెకావత్ను కోరారు. తెదేపా నేతల బృందం దిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిని కలిశారు. ప్రకాశం జిల్లా కరువు పరిస్థితిని, జిల్లా నైసర్గిక స్వరూపాన్ని, వెలుగొండ ప్రాజెక్టు ప్రాధాన్యతను సవివరంగా కేంద్రమంత్రికి వివరించారు. ఎమ్మెల్యేలు బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌తో పాటు నాయకులు సాంబశివరావు, జనార్దన్, ఉగ్రనరసింహా రెడ్డి కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రిని కలిసిన తెదేపా నేతల బృందం - కేంద్రమంత్రిని కలిసిన తెదేపా నేతలు
తెదేపా నేతల బృందం.. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రిని కలిసింది. వెలుగొండ ప్రాజెక్టును గెజిట్‌లో చేర్చాలని విజ్ఞప్తి చేసింది.
tdp