వైకాపా నాయకుల వేధింపులతో మొన్నటివరకూ ఎస్సీలను బలిచేసి.. ఇప్పుడు మైనార్టీలపై పడ్డారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అధికారులను సస్పెండ్ చేసినట్లు, కేసు పెట్టినట్లు సీఎం జగన్ ఆడేవన్నీ నాటకాలని దుయ్యబట్టారు. నామమాత్రపు సెక్షన్లు పెట్టి ప్రజా సంఘాల వ్యతిరేకత చూశాక బెయిల్ రద్దుకు అప్పీల్ చేయడం జగన్నాటకమేనని ఆరోపించారు. సలాం తరహాలో రాష్ట్రంలో వేలాదిమంది ఉన్నారన్నారు. సలాం కుటుంబానికి అండగా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజాందోళనలు చేపట్టామని వివరించారు.
నంద్యాల ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. పోలీసు అధికారుల కాల్ డేటా బహిర్గతం చేసి వారిని సర్వీసుల నుంచి తొలగించాలన్నారు. ఎల్జీ పాలిమర్స్ తరహాలో సలాం కుటుంబసభ్యులకు పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సెల్ఫీ వీడియో లేకపోతే కుటుంబ కలహాలతో సలాం చనిపోయినట్లు చిత్రీకరించేవారని దుయ్యబట్టారు. అరాచకాలను అరికట్టడంలో విఫలమైన డీజీపీ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని..., ముస్లిం సమాజానికి జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు : లోకేశ్