ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నాసిరకం సరకులపై ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలి' - ex minister devineni uma fire on jagan

రేషన్ దుకాణాల్లో నాసిరకం సరకులను పంపిణీ చేస్తున్నారంటూ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. దీనిపై సీఎం జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

tdp leaders  fire on ycp
tdp leaders fire on ycp

By

Published : May 18, 2020, 12:13 PM IST

దేవినేని ఉమా ట్వీట్

75 ఏళ్ల వయసులో కేరళ ముఖ్యమంత్రి 9 రకాల నిత్యావసరాలను ప్రజల ఇళ్లకు పంపిస్తుంటే......రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రేషన్ దుకాణాల్లో నాసిరకం బియ్యం, శనగలు ఇస్తోందని తెదేపా నేత దేవినేని ఉమా మండిపడ్డారు. తినేలా లేని ఈ సరకులను ప్రజాప్రతినిధుల ఇళ్లలో వండించగలరా అంటూ నిలదీశారు. నాసిరకం సరకులపై ప్రజలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉన్నత న్యాయస్థానం తీర్పును లెక్కపెట్టకుండా వలస కార్మికులను మళ్లీ కొట్టారని ఆరోపించారు. సొంతూళ్లకు పంపించమంటున్న వలస కూలీలపై ప్రతాపం చూపటంపై ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలన్నారు.

ఎంపీ కేశినేని నాని ట్వీట్

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.......... వ్యాపారులను బెదిరించి మరీ దండుకుంటున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. దుర్గగుడిని మొత్తం దోచేస్తూ వినాయకుడి గుడినీ వదలటం లేదని ఆరోపించారు. విశాఖలో డాక్టర్ సుధాకర్‌ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘాటుగా ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details