BondaUma: తెదేపా అధినేత చంద్రబాబు దిల్లీ వెళ్తే తాడేపల్లిలో వణుకు మొదలైందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. 40 ఏళ్లల్లో కొన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నామన్న ఆయన.. పొత్తులనేవి ఉంటే స్వయంగా చంద్రబాబే చెబుతారని స్పష్టం చేశారు. రహస్యంగా పొత్తులు పెట్టుకోవడం కుదరదు కదా అని అన్నారు. జగన్ ఇన్నిసార్లు దిల్లీ వెళ్లినా.. ఒక్క పనైనా పూర్తి చేసుకుని వచ్చారా అని నిలదీశారు. సింహంలా ఫ్లైటెక్కడం.. దిల్లీలో లెగ్ అప్పీల్ చేసుకోవడమే జగన్ తీరు అని విమర్శించారు. ఏ2 విజయసాయిరెడ్డి దిల్లీలో కూర్చొని లంచులు.. సంచులతో మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుంటూ ఓటుకు నోటు కేసులో వైకాపా ఎమ్మెల్యే ఆర్కే సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఛీ కొట్టించుకున్నారని గుర్తుచేశారు.
ఓటుకు నోటు కేసు ఛార్జ్ షీటులో చంద్రబాబు పేరు కూడా లేదని తెలిపారు. జగన్... దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు. సీఎం జగన్ గ్రాఫ్ పడిపోతుందని... అందుకే కార్యకర్తలను పిలిచి మాట్లాడుతున్నారని బోండా ఉమా ఎద్దేవా చేశారు. సీఎం ఇంటి గేటు ముందు బొత్స దిగితే గతంలో సమయం లేదని వెనక్కి పంపేశారని... అలాంటి పరిస్థితి నుంచి పిలిపించుకుని మాట్లాడే స్థితికి చేరారన్నారు. అంబటి, అవంతి వాయిస్‌ను ఫోరెన్సిక్ ల్యాబుకు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. సజ్జల కానీ.. మాధవ్ ను వెనకేసుకొచ్చే ఏ నాయకుడైనా.. మాధవ్ వీడియోను వాళ్ల ఇంట్లో చూపగలరా అని నిలదీశారు. మాధవ్ నగ్న వీడియో వ్యవహారంపై సీఎం జగన్ మౌనం వీడాలని బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.