రాష్ట్రవ్యాప్తంగా 171మంది తెలుగుదేశం నేతలను గృహ నిర్బంధం చేసినట్లు ఆ పార్టీ ప్రకటించింది. చలో గుంటూరు-జైల్ భరోకి పిలుపునిచ్చినందుకు పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు గృహ నిర్బంధాలు చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా 171 మంది తెదేపా నేతలు గృహ నిర్బంధం - ఏపీలో తెదేపా ధర్నా వార్తలు
చలో గుంటూరు-జైల్ భరోకి తెలుగుదేశం పిలుపునిచ్చిన క్రమంలో పోలీసులు ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. రాష్ట్రంలో మొత్తం 171 మంది తెదేపా నేతలను గృహ నిర్బంధం చేసినట్లు తెదేపా వెల్లడించింది.
తూర్పుగోదావరి జిల్లాలో 43, కృష్ణాలో 41, పశ్చిమగోదావరి జిల్లాలో 34, విజయనగరంలో 15, నెల్లూరులో 17, గుంటూరులో 8మంది, ప్రకాశంలో ముగ్గురు, విశాఖ, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున గృహ నిర్బంధం చేసినట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, బచ్చుల అర్జునుడు, అశోక్ బాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తెలుగుయువత నాయకుడు దేవినేని చందు తదితరులను పోలీసులు బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరును నేతలు తీవ్రంగా ఖండించారు. పలుచోట్ల వారితో వాగ్వాదానికి దిగారు.