ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

LOKESH: నారా లోకేశ్​ అరెస్టుపై తెదేపా నేతల ఆగ్రహం - నారా లోకేశ్​ అరెస్టుపై తెదేపా నేతల ఆగ్రహం

నారా లోకేశ్​ అరెస్టుపై తెదేపా నేతల ఆగ్రహం
నారా లోకేశ్​ అరెస్టుపై తెదేపా నేతల ఆగ్రహం

By

Published : Aug 16, 2021, 7:30 PM IST

Updated : Aug 16, 2021, 8:51 PM IST

20:50 August 16

గుంటూరు: పెదకాకాని పీఎస్‌ నుంచి నారా లోకేశ్‌ విడుదల

  • గుంటూరు: పెదకాకాని పీఎస్‌ నుంచి నారా లోకేశ్‌ విడుదల 
  • నోటీసులపై సంతకం పెట్టించుకుని పంపించిన పోలీసులు
  • కాసేపట్లో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడనున్న లోకేశ్‌
  • మధ్యాహ్నం రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన లోకేశ్‌
  • పరామర్శకు వెళ్లిన లోకేశ్‌ను ప్రత్తిపాడు పీఎస్‌ తరలించిన పోలీసులు
  • లోకేశ్‌పై 151 సీఆర్పీసీ కింద అభియోగాలు నమోదు
  • సాయంత్రం ప్రత్తిపాడు పీఎస్‌ నుంచి లోకేశ్‌ను తరలించిన పోలీసులు
  • లోకేశ్‌ను తన కాన్వాయ్‌లోనే గోప్యంగా తరలించిన పోలీసులు
  • పొన్నూరు చుట్టుపక్కల డొంక రోడ్డుల్లో లోకేశ్‌ను తిప్పిన పోలీసులు
  • పెదనందిపాడు, పొన్నూరు, గుంటూరు మీదుగా తరలింపు
  • చివరకు లోకేశ్‌ను పెదకాకాని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు
  • నోటీసులపై సంతకం పెట్టించుకుని లోకేశ్‌ను విడుదల చేసిన పోలీసులు

20:11 August 16

పెదకాకాని పోలీస్‌స్టేషన్‌కు నారా లోకేశ్‌

  • గుంటూరు: నారా లోకేశ్‌ను పెదకాకాని పీఎస్‌ తరలించిన పోలీసులు
  • గుంటూరు: లోకేశ్‌పై 151 సీఆర్పీసీ కింద అభియోగాలు నమోదు
  • ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌ నుంచి లోకేశ్‌ను తరలించిన పోలీసులు
  • లోకేశ్‌ను తన కాన్వాయ్‌లోనే గోప్యంగా తరలించిన పోలీసులు
  • పొన్నూరు చుట్టుపక్కల డొంక రోడ్డుల్లో లోకేశ్‌ను తిప్పిన పోలీసులు
  • లోకేశ్‌ను పెదకాకాని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు

19:58 August 16

రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందన చంద్రబాబు

  • రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది: చంద్రబాబు
  • మహిళలకు రక్షణ కల్పనలో ప్రభుత్వం ఘోర వైఫల్యం: చంద్రబాబు
  • సీఎం ఇంటికి సమీపంలోనే హత్య జరిగితే శాంతిభద్రతలు ఎక్కడున్నాయి: చంద్రబాబు
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలే లక్ష్యంగా నేరాలు: చంద్రబాబు
  • ఆడబిడ్డలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు: చంద్రబాబు
  • తెదేపా నేతలు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు: చంద్రబాబు
  • రమ్య కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇచ్చి ఆదుకోవాలి: చంద్రబాబు

19:58 August 16

ఒంగోలులో తెదేపా ఆధ్వర్యంలో నిరసన

  • లోకేశ్‌ అరెస్టుకు నిరసనగా తెదేపా మహిళా కార్యకర్తల ఆందోళన
  • తెదేపా మహిళా కార్యకర్తలను రెండో పట్టణ పీఎస్‌ తరలింపు
  • మహిళా కార్యకర్తలను విడిచిపెట్టాలని తెదేపా నాయకుల డిమాండ్‌

19:53 August 16

అంత్యక్రియలకు వెళితే అరెస్ట్​ చేస్తారా.. కాల్వ శ్రీనివాసులు

అంత్యక్రియలకు వెళ్లిన వారిని అరెస్టు చేసే పోలీసులను ఆంధ్రప్రదేశ్ లోనే చూస్తున్నామని తెదేపా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. అనంతపురంలో గాంధీ విగ్రహం వద్ద ఆయన ఆధ్వర్యంలో తెదేపా నేతలు ఆందోళన నిర్వహించారు. ఆడబిడ్డను కిరాతకంగా హత్యచేసిన సంఘనటన ప్రభుత్వ వైఫల్యమేనని కాలవ ఆరోపించారు. మాజీ మంత్రిపై చేయిచేసుకున్న పోలీసు అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

19:53 August 16

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ర్యాలీ..

తెదేపా నేతల అరెస్టులను నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి ర్యాలీ చేపట్టారు. డౌన్ డౌన్ సీఎం అంటూ నినాదాలు చేశారు. దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

19:53 August 16

చిలకలూరిపేటలో నిరసన సెగ..

రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించటానికి వెళ్లిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తదితరులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ చిలకలూరిపేటలో తెదేపా నాయకులు కార్యకర్తలు సాయంత్రం రహదారిపై ధర్నా చేశారు. వెంటనే తెదేపా నాయకుల ను విడుదల చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు.

19:52 August 16

పొన్నూరు వైపుకు తరలింపు..

సాయంత్రం స్టేషన్ నుంచి లోకేశ్​ బయటకు రావడంతో.. మహిళలు వీర తిలకం పెట్టి.. హారతి ఇచ్చారు. అనంతరం లోకేశ్​ని వాహనంలో ఎక్కించి పోలీసులు హైడ్రామా చేశారు. నేరుగా గుంటూరు తరలించకుండా..పెదనందిపాడు, కాకుమాను, పొన్నూరు రోడ్డులలో తిప్పుతూ.. గుంటూరు వైపు తీసుకెళ్లారు. లోకేశ్​ వాహనం వెనుక వస్తున్న కార్యకర్తల వాహనాలను అబ్బినేనిగుంటపాలెం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కాకుమాను మండలం బండ్లవారిపాలెం వద్ద తెదేపా కార్యకర్తలు లోకేశ్​ వెళ్తుండగా ఆపారు. అక్కడ పోలీసులు కార్యకర్తలకు నచ్చజెప్పి పొన్నూరు వైపు తీసుకెళ్లారు.

19:52 August 16

విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఆధ్వర్యంలో నిరసన..

  • లోకేశ్ అరెస్టుకు నిరసనగా ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కాగడాల ప్రదర్శన
  • రమ్య హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
  • తెదేపా నాయకుల అక్రమ అరెస్టులను ఖండించాలని నినాదాలు

19:51 August 16

ఒంగోలులో తెదేపా ఆధ్వర్యంలో నిరసన..

  • లోకేశ్‌ అరెస్టుకు నిరసనగా తెదేపా మహిళా కార్యకర్తల ఆందోళన
  • తెదేపా మహిళా కార్యకర్తలను రెండో పట్టణ పీఎస్‌ తరలింపు
  • మహిళా కార్యకర్తలను విడిచిపెట్టాలని తెదేపా నాయకుల డిమాండ్‌

19:12 August 16

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ను పోలీసులు అరెస్ట్​ చేయడంపై తెదేపా నేతలు, శ్రేణులు తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. వైకాపా ప్రభుత్వం కావాలనే ఆయనను తిప్పుతూ వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మండిపడ్డ బోండా ఉమ..

ముఖ్యమంత్రి ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఒక సంఘటన జరిగితే ఎందుకు నిందితుడుని పట్టుకోలేక పోయారు ? మొదట సంఘటనలో పోలీసులు నిందితులను పట్టుకున్నట్లు అయితే ఇవాళ గుంటూరులో ఈ సంఘటన జరిగేదా? పరామర్శించడానికి వచ్చిన లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారా? సీనియర్ నాయకులు నక్క ఆనంద బాబు గారు .. ప్రశ్నించే గొంతు ఆయనను ఒక పోలీసు అధికారి చేయి చేసుకుంటాడా? ఎక్కడ ఉంది మీ దిశ చట్టం? ఇవాళ రాష్ట్రంలో ప్రజలు అడుగుతున్నారు గన్ ఎక్కడ.. అని గన్ లేదు జగన్ లేడు! తాడేపల్లి లో 144 sec పెట్టుకొని ఉంటున్నాడు. తోలుకొడు గ్రామంలో ఒక దళిత మహిళ ని చంపేస్తే ముఖ్యమంత్రి పట్టించుకోడా? ఇటువంటి సంఘటనలపై చర్యలు లేకపోబట్టే రోజు రోజుకు ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఒక్క రోజు శాసన సభ పెట్టుకొని ఈ ప్రభుత్వం పారిపోయింది. ముఖ్యమంత్రి నోరు తెరవాలి ? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ?

తాలిబన్ల పాలన నడుస్తోంది..

ఎస్సీ కుటుంబానికి అన్యాయం జరిగితే సాటి ఎస్సీలకు, ప్రతిపక్షపార్టీగా తెదేపా నేతలకు బాదిత కుటుంబాన్ని పరామర్శించే హక్కు లేదా అని ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్, టిఎన్​ఎస్​ఎఫ్ ప్రణవ్​లు నిలదీశారు. రాష్ట్రంలో తాలిబన్ల పాలన సాగుతోందని, ఎస్సీలకు జీవించే హక్కు లేదా అని ప్రశ్నించారు. నేతల అక్రమ అరెస్టులు దుర్మార్గమని గుమ్మడి సంధ్యారాణి ఆక్షేపించారు. 

Last Updated : Aug 16, 2021, 8:51 PM IST

For All Latest Updates

TAGGED:

nara lokesh

ABOUT THE AUTHOR

...view details