ఐటీ దాడుల పంచనామా నివేదికపై మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. రూ.2 వేల కోట్లు అంటూ తెదేపాపై దుష్ప్రచారం చేశారని వైకాపా నేతలపై మండిపడ్డారు. వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. వైకాపా నేతలు, సాక్షి మీడియాపై పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు. రూ.2 లక్షలను రూ.2 వేల కోట్లని ప్రచారం చేస్తారా? అని ధ్వజమెత్తారు. పంచనామా నివేదికపై వైకాపా నేతలు ఇప్పుడేం జవాబిస్తారని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం చేసినందుకు తెదేపాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రూ.2లక్షలను రూ.2వేల కోట్లని ప్రచారం చేస్తారా..? - దేశ వ్యాప్తంగా ఐటీ దాడుల వార్తలు
ఐటీ దాడుల పంచనామా నివేదికపై వైకాపా నేతలు ఏం సమాధానం చెబుతారని తెదేపా నేత యనమల ప్రశ్నించారు. రూ.2 వేల కోట్లు అంటూ ప్రచారం చేసిన ఆ పార్టీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
tdp leader Yanamala fire on ycp leaders over IT rides