పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన చేసిన తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్కు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కొవిడ్ నిబంధనలు అనుసరించి ఆగస్టు 28న రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నేతలు నిరసనలు తెలిపారని వివరించారు. అధికార పార్టీ.. పోలీసు బలగాలతో నిరసన తెలిపిన వారిని బలవంతంగా అరెస్టు చేయించటం, గృహ నిర్బంధాలు చేసిందని విమర్శించారు. పోలీసులు రాజ్యాంగాన్ని విస్మరించి ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘించారని మండిపడ్డారు. ఎలాంటి కొవిడ్ నిబంధనలు పాటంచని వైకాపా కార్యక్రమాల పట్ల పోలీసులు పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.
పోలీసులపై.. ఎన్హెచ్ఆర్సీకి వర్ల రామయ్య ఫిర్యాదు - పోలీసులపై ఎన్హెచ్ఆర్సీకి వర్ల రామయ్య ఫిర్యాదు
జాతీయ మానవ హక్కుల కమిషన్కు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. చమురు ధరల పెరుగుదలపై నిరసన తెలిపిన తెదేపా నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని.. వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
tdp leader varla ramayya complaint on police to nhrc