ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎమ్మెల్యే ఆర్కేను అరెస్ట్ చేయాలి: వర్ల రామయ్య - వైకాపా ఎమ్మెల్యే ఆర్కేపై వర్ల రామయ్య ఫైర్

ఎమ్మెల్యే ఆర్కే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఆయన్ను అరెస్ట్ చేయాలని తెదేపా నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. తమ అధినేత చంద్రబాబును ఏదో ఒక విధంగా జైల్లో పెట్టాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

తెదేపా నేత వర్ల రామయ్య
తెదేపా నేత వర్ల రామయ్య

By

Published : Mar 22, 2021, 7:15 PM IST

"న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలి" అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఆళ్ల కార్యాలయంలో పనిచేసే వాళ్లతో పాటు పలువురు వాలంటీర్లను రైతులుగా చూపిస్తున్నారని ఆరోపించారు.

తెదేపా అధినేత చంద్రబాబుని ఏదో ఒకలా నాలుగు రోజులు జైల్లో పెట్టాలన్నది సీఎం జగన్ తాపత్రయమని మండిపడ్డారు. చంద్రబాబు స్టే తెచ్చుకున్నారంటున్న మంత్రులు.. గతంలో జగన్ బెయిల్ కోసం కోర్టుల చుట్టూ ఎలా తిరిగారో మర్చిపోయారా అని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details