ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు ఎక్కడా ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. అప్పులబాధ తట్టుకోలేక రూ.900, 1000లోపే రైతులు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారని అన్నారు. రైతులు పంటను మద్దతు ధరకు అమ్ముకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అమూల్ సంస్థకు రూ.3వేల కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి మరీ.. రాష్ట్రంలోని పాడిరైతుల సహాకారసంఘాలను నిర్వీర్యం చేస్తున్నారని మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్‌పై కక్ష సాధింపు కోసం రాష్ట్రంలోని చిన్నచిన్న డెయిరీలను నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు.