ప్రజలకు సకాలంలో మాస్కులు అందించకుండా.. మాస్కు పెట్టుకోని వారికి జరిమానా ఎలా విధిస్తారని.. మాజీమంత్రి జవహర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ప్రజలకు అండగా నిలవాలన్నారు. తూతూమంత్రంగా చేసే సమీక్షా సమావేశాలతో ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు. కేంద్ర మార్గదర్శకాలు రాష్ట్రంలో ఎక్కడా అమలు కావటం లేదని ఆరోపించారు. సెకండ్ వేవ్ ఉధృతికి అనుగుణంగా కొవిడ్ ఆసుపత్రుల సంఖ్యను పెంచటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో యధేచ్ఛగా దోపిడీ కొనసాగుతోందన్నారు. రాజకీయ ప్రయోజనాలకే వైకాపా నేతలు పరిమితమయ్యారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ప్రణాళికా లోపంతో టీకా ప్రక్రియ ప్రహసనంలా మారిందని అసహనం వ్యక్తం చేశారు. మొదటి డోస్ టీకా వేయించుకున్న వారికి రెండో డోస్ అందుతుందో లేదో తెలియని పరిస్థితికి ప్రభుత్వమే కారణమన్నారు.
మాస్కులు అందించకుండా... జరిమానాలా?: జవహర్ - ex minister jawahar latest news
మాజీ మంత్రి జవహర్.. ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా విస్తరిస్తోందనీ.. సమీక్షా సమావేశాలతో ప్రయోజనం లేదని అన్నారు. కేంద్రం మార్గదర్శకాలు రాష్ట్రంలో అమలు కావటం లేదని ఆరోపించారు.
జవహర్