ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అసమర్థుడి పాలన వల్లే ఇలాంటి పరిస్థితి: దేవినేని - తెదేపా నేత దేవినేని ఉమ

DEVINENI UMA: ఇదే గోదావరి వరద ఉద్ధృతి సమయంలో చంద్రబాబు నాయుడు గాని సీఎంగా ఉండి ఉంటే.. ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించేవారని.. ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ పరిస్థితిని అదుపు చేసేవారని.. తెదేపా నేత దేవినేని ఉమ అన్నారు. సీఎం జగన్‌ అసమర్థ పాలన కారణంగానే నేడు ఈ స్థాయిలో వరద బాధితులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

DEVINENI UMA
DEVINENI UMA

By

Published : Jul 17, 2022, 3:39 PM IST

DEVINENI UMA:గోదావరి వరద అంచనాలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. పోలవరం నిర్వాసితులను ప్రభుత్వం గాలికొదిలేసిందని తెదేపా నేత దేవినేని ఉమ ధ్వజమెత్తారు. జూన్, జులైలో వరదలొస్తాయనే కనీస స్పృహ కూడా లేదని విమర్శించారు. అసమర్థుడి చేతిలో పాలన ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద పరిస్థితిని కూడా అంచనా వేయలేని స్థితిలో ఉన్నారని మండిపడ్డారు.

పోలవరం నిర్వాసితులకు ఆమడ దూరంలో అధికారులు ఉన్నారని.. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. యంత్రాంగం పని చేస్తుందా అని ప్రశ్నించారు. వరదల వల్ల గ్రామాలు మునిగిపోతుంటే అధికారులు పట్టించుకోరా అని ధ్వజమెత్తారు. వరద బాధితులకు సాయం చేసే పరిస్థితి కూడా కరవైందని..గ్రామాలకు గ్రామాలు మునిగిపోతున్నా చీమ కుట్టినట్లు లేదని మండిపడ్డారు.

అసమర్థుడి చేతిలో పాలన ఉంటే.. పరిస్థితి ఇలాగే ఉంటుంది

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details