1 నుంచి 5వతరగతి విద్యార్థులకు ఇచ్చే వారధి పాఠ్యపుస్తకాలపై సీఎం జగన్ ఫోటో ఎలా ముద్రిస్తారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి ముద్రించిన ఈ పుస్తకాలకు ఏ అధికారులు, ఏ మంత్రి బాధ్యత వహిస్తారో సమాధానం చెప్పాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యం వైకాపా నాయకుల గడ్డివాములో దొరికిందని ఉమా ఆరోపించారు.
బ్రాండ్ల తీగలాగితే 34 లక్షల మద్యం మైలవరంలో దొరికిందని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ షాపుల్లో నాసిరకం మద్యం అమ్ముతున్నారన్న ఉమా... వైకాపా నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న వందల కోట్ల అక్రమ మద్యం మాఫియాపై జగన్ ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.