Chintakayala Vijay wife petition: సీఐడీ పోలీసులు.. తమ పిల్లలను మానసిక వేదనకు గురి చేశారంటూ హైకోర్టులో తెదేపా నేత చింతకాయల విజయ్ భార్య డాక్టర్ సువర్ణ పిటిషన్ దాఖలు చేశారు. నోటీసుల పేరుతో మళ్లీ ఇబ్బంది పెడతారని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీ, ఏడీజీ, సీఐడీ సీఐ పెద్దిరాజును ఆదేశించింది. మళ్లీ ఇబ్బంది పెట్టకుండా ఆదేశాలివ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది సతీష్ వాదించారు. మళ్లీ ఈ తరహా ఘటన జరగదని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
'సీఐడీ పోలీసులు మానసిక వేదనకు గురి చేశారు' - ఏపీ తాజా వార్తలు
Chintakayala Vijay wife petition: సీఐడీ పోలీసులు.. తమ పిల్లలను మానసిక వేదనకు గురి చేశారని హైకోర్టులో చింతకాయల విజయ్ భార్య డాక్టర్ సువర్ణ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన ధర్మాసనం.. డీజీపీ, ఏడీజీ, సీఐ పెద్దిరాజుకు నోటీసులు జారీ చేసింది. తదపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
చింతకాయల విజయ్