రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతల గృహ నిర్బంధాలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖండించారు. గుంటూరులో మహిళలు, జేఏసీ నాయకులపై అమానవీయంగా వ్యవహరించడం దుర్మార్గమని ఆక్షేపించారు. రైతులకు సంకెళ్లు వేయడంతో పాటు ఎస్సీలపైనే... ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన శాంతియుత నిరసన ప్రదర్శనలు అడ్డుకోవడం సరికాదన్నారు. తద్వారా ప్రాథమిక హక్కులను కాలరాసి, ప్రజాస్వామ్య విలువలను మంటగలిపారని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కి సాగిస్తున్న దమనకాండను అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
'రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కారు' - తెలుగుదేశం పార్టీ తాజా వార్తలు
జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన శాంతియుత నిరసన ప్రదర్శనలు అడ్డుకోవడం సరికాదని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కారని, ప్రజాస్వామ్య విలవలను మంటగలిపారని ఆయన మండిపడ్డారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు