గుంటూరు జిల్లా మాచవరం మండలం కొత్తపాలెం గ్రామంలో గర్భిణి రోజాను వైకాపా గూండాలు గర్భంపై తన్ని పాపం మూటగట్టుకున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. గర్భిణీ అన్న కనికరం కూడా లేకుండా మానవత్వం మరచి వైకాపా నేతలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతే దాడులు చేస్తారా అని నిలదీశారు. వైకాపా గెలిచిన చోట తెదేపా కార్యకర్తలు ఏమైనా దాడుల చేశారా..? అని ప్రశ్నించారు. అన్యాయం జరుగుతుంటే పట్టించుకోని గుడ్డి ప్రభుత్వం ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటేనని ఆగ్రహాం వ్యక్తం చేశారు. మహిళా కమిషన్ ఆచూకీ కోసం మహిళలంతా కేసు పెట్టాలని పిలుపునిచ్చారు. మహిళలకు స్వేచ్ఛగా వెళ్లి జరిగిన అన్యాయాన్ని పోలీసులకు చెప్పుకునే స్థితి ఉందా అని అచ్చెన్న నిలదీశారు. ఆడబిడ్డల ఉసురు తగిలితే వైకాపాకు పుట్టగతులుండవని హెచ్చరించారు
ఎన్నికల్లో ఓడిపోతే దాడులు చేస్తారా..?: అచ్చెన్నాయుడు - అచ్చెన్నాయుడు
వైకాపా నేతలపై అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం కొత్తపాలెం గ్రామంలో గర్భిణి రోజాను వైకాపా గూండాలు గర్భంపై తన్ని పాపం మూటగట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతే దాడులు చేస్తారా అని నిలదీశారు.
atchannaidu fiers on ycp