ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతినే రాష్ట్ర రాజధానిగా సీఎం ప్రకటించాలి: వంగలపూడి అనిత - vijayawada news

రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించాలని తెదేపా నేత వంగలపూడి అనిత డిమాండ్​ చేశారు. 496 రోజులుగా పోరాటం సాగిస్తున్న రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మూడు రాజధానుల నిర్ణయం వల్ల కొత్తగా అభివృద్ధి ఎక్కడ జరిగిందంటూ నిలదీశారు.

వంగలపూడి అనిత
అమరావతినే రాష్ట్ర రాజధానిగా సీఎం ప్రకటించాలి

By

Published : Apr 27, 2021, 9:08 PM IST

రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే ప్రకటించాలని వంగలపూడి అనిత డిమాండ్​ చేశారు. మహిళలు, రైతుల పోరాటాన్ని 496 రోజులుగా ప్రభుత్వం పట్టించుకోకపోవటం సిగ్గుమాలిన చర్య అని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే రైతులు ఉద్యమం చేస్తున్నారని ఆమె అన్నారు.

రాజధాని లేని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవ్వరూ ముందుకు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారంతో అమరావతి నిర్మాణాన్ని నిలిపివేసి యువతకు ఉద్యోగాలు దూరం చేశారని ఆరోపించారు. మూడు రాజధానుల నిర్ణయంతో రాష్ట్రంలో కొత్తగా ఏం అభివృద్ధి చేశారంటూ అనిత ప్రశ్నించారు. ప్రజలకు మూడు మాస్కులే ఇవ్వలేని అసమర్థుడు మూడు రాజధానులు కడతాడంటే నమ్మే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details