అచ్చెన్నాయుడి వ్యవహారంలో ప్రభుత్వ తీరు అనుమానాలకు తావిస్తోందని తెలుగుదేశం నేత ఆలపాటి రాజా వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా... వైద్యులతో తప్పుడు రిపోర్టులు రాయించి డిశ్చార్జి చేయించేందుకు యత్నించారని ఆరోపించారు. ఇదంతా చూస్తుంటే అచ్చెన్నాయుడిని హతమార్చేందుకు కుట్ర పన్నారని అనుమానంగా ఉందన్నారు.
'అచ్చెన్నాయుడు వ్యవహారంలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రోజంతా తిప్పారు. న్యాయస్థానం ఆయన్ను ఆసుపత్రిలో చేర్చాలని ఆదేశించింది. జీజీహెచ్‌లో సరైన వసతులు లేకున్నా చేర్పించారు. జీజీహెచ్‌లో మరోసారి శస్త్ర చికిత్స చేశారు. వైద్యులతో తప్పుడు రిపోర్టులు రాయిస్తున్నారు. గాయాలు మానకపోయినా ఆస్పత్రి అధికారులు డిశ్చార్జికి యత్నించారు. ఈఎస్ఐ అక్రమాల్లో అచ్చెన్నాయుడి పాత్ర లేకపోయినా అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవట్లేదు. అచ్చెన్నాయుడిని హతమార్చేందుకు కుట్ర పన్నారా?' - ఆలపాటి రాజా, తెదేపా నేత