ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కాపులకు మీరు చేసిందేంటి..?' సీఎంకు కళా బహిరంగ లేఖ - tdp kala venktarao comments on kapu welfare

రాష్ట్ర ప్రభుత్వం కాపు సామాజిక వర్గంపై ఏడాది కాలంగా నిర్లక్ష్యం చూపిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. బడ్జెట్​ లెక్కల్లో తప్పులు ఉన్నాయని నిరసిస్తూ.. ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు. ఆర్థికంగా, సామాజికంగా వారికి అన్యాయం చేస్తున్నారని లేఖలో విమర్శించారు.

'కాపులకు మీరు చేసిందేంటి..?'.. సీఎంకు కళా బహిరంగ లేఖ
'కాపులకు మీరు చేసిందేంటి..?'.. సీఎంకు కళా బహిరంగ లేఖ

By

Published : Jul 5, 2020, 1:43 PM IST

Updated : Jul 5, 2020, 2:15 PM IST

రాష్ట్ర ప్రభుత్వం కాపులకు చేసింది గోరంత.. చెప్పేది కొండంతని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. కాపు సామాజికవర్గంపై ఏడాది కాలంగా నిర్లక్ష్యం, నిర్లిప్తత చూపిస్తున్నారని నిరసిస్తూ.. సీఎం జగన్​కు బహిరంగ లేఖ రాశారు. బడ్జెట్​ లెక్కలు అరచేతిలో వైకుంఠం చూపించే తరహాలో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. బడ్జెట్ మొత్తం అబద్దాలే తప్ప అద్భుతాలు ఎక్కడున్నాయని నిలదీశారు.

అధికారం కోసం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కాపులను వాడుకున్నారని.. సంక్షేమ పథకాలు, నామినేటెడ్ పదవుల్లో వారికి అన్యాయం చేస్తున్నది వాస్తవం కాదా అని కళా.. లేఖలో ప్రశ్నించారు. కాపులకు రాజకీయ, సామాజిక, ఆర్ధిక గుర్తింపు కేవలం తెదేపాతో హయాంలోనే లభించిందని స్పష్టం చేశారు. రెండు దశాబ్దాల క్రితమే ఐదు రాజ్యసభ, ఐదు లోక్​సభ సీట్లు ఇచ్చామని గుర్తు చేశారు. కాపులను వంచించడం మాని.. విజ్ఞతతో పాలించాలని కళా హితవు పలికారు.

కళా వెంకట్రావు బహిరంగ లేఖ
Last Updated : Jul 5, 2020, 2:15 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details