న్యాయవ్యవస్థపై అంబటి రాంబాబు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని చర్యలు చేపట్టాలని మాజీమంత్రి జవహర్ కోరారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ కక్షతో అమరావతి భూముల విషయంలో సిట్, కేబినెట్ సబ్ కమిటీ వేశారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం ఈ 16 నెలల కాలంలో ఎలాంటి అక్రమాలను నిరూపించలేక పోయారని.. ఆధారాలు లేకపోవడంతో కోర్టుల్లో కేసులు నిలబడటం లేదని అన్నారు. సుప్రీంకోర్టు కూడా వైకాపా నేతల వాదనతో ఏకీభవించలేదని పేర్కొన్నారు. బెయిల్ పై బయట తిరుగుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. తన అవినీతి బురదను ఇతరులకు అంటించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైన్, మైన్, ల్యాండ్ మాఫియాలతో పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపై హింసాకాండ కొనసాగుతూనే ఉందని దుయ్యబట్టారు.
అంబటి రాంబాబు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోండి : జవహర్ - ఏపీ లేటెస్ట్ న్యూస్
వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను సుమోటోగా చేసుకుని చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. సీఎం తన అవినీతి బురదను ఇతరులకు అంటించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు.
tdp jawahar