రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి తెదేపా... ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేసింది. పార్టీలో అభ్యర్థిగా బరిలో ఉన్న వర్లరామయ్యకు ఓటు వేయాలని విప్‌లో స్పష్టం చేసింది. రాజ్యసభ ఓటు హక్కు వినియోగించుకునే ముందు ఎవరికి ఓటు వేస్తున్నారో.. పార్టీ పరిశీలకుడికి చూపించాల్సి ఉందని.... ఆదేశాలు ధిక్కరిస్తే అనర్హత వేటు తప్పదని హెచ్చరించింది. తెదేపా నుంచి ఎన్నికైన ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు.. కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి విప్ పరిధిలోకి వచ్చారు.
తెదేపా ఎమ్మెల్యేలకు విప్ జారీ.. 'ధిక్కరిస్తే వేటే'..! - tdp mlas on whip news
రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది తెదేపా. అభ్యర్థిగా బరిలో ఉన్న వర్ల రామయ్యకు ఓటు వేయాలని స్పష్టం చేసింది.
తెదేపా ఎమ్మెల్యేలకు విప్ జారీ.. 'ధిక్కరిస్తే వేటే'..!