హుజుర్నగర్ బరిలో తెదేపా..నేతలతో అధినేత చర్చ - tdp discussion on huzurnagar bielection
హుజుర్నగర్ ఉపఎన్నికల బరిలో తెదేపా పోటీ చేయాలా వద్దా అనే దానిపై తెతెదేపా నేతలతో చర్చించి రేపు నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు తెలిపారు. పోటీ ఖాయమైతే అభ్యర్థిగా నన్నూరి నర్సిరెడ్డి లేదా చావా కిరణ్మయి పేర్లను పరిశీలించే అవకాశం ఉంది.
tdp discussion on huzurnagar bielection
తెలంగాణలోని నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ ఉపఎన్నికపై తెలుగుదేశం పార్టీలో చర్చ జరిగింది. అధినేత చంద్రబాబు ఆ పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలను సేకరించారు. హుజుర్నగర్లో పార్టీ తరఫున అభ్యర్థిని బరిలోకి దించాలని నాయకులు చంద్రబాబుకు సూచించారు. శనివారం తెలంగాణ నేతలతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు వారికి తెలిపారు. పోటీ ఖాయమైతే అభ్యర్థిగా నన్నూరి నర్సిరెడ్డి లేదా చావా కిరణ్మయి పేర్లను అధిష్టానం పరిశీలించే అవకాశం ఉంది.
TAGGED:
హుజుర్నగర్ బరిలో తెదేపా