వైకాపా ప్రభుత్వం తెదేపాపై కక్షతో ఏమైనా చేయొచ్చు కానీ.. అన్న క్యాంటీన్లు మూసివేసి పేదలను కష్టపెట్టడాన్ని సహించలేకపోతున్నామంటూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల వద్ద నిరసన దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. అవి తెరిచేవరకూ ఉద్యమిద్దాం అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
'అన్న క్యాంటీన్ల మూసివేత ఒక్కటి చాలు, అదే వేయి పాపాలు చేసినంత' అని లోకేశ్ ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు. అవి మళ్లీ తెరచి పేదలు ఆకలి తీర్చండంటూ వైకాపా ప్రభుత్వానికి సూచించారు.
అన్న క్యాంటీన్లు తెరిచేవరకూ ఉద్యమిస్తాం: చంద్రబాబు - twitter
"తెదేపాపై కక్షతో ప్రభుత్వం ఏమైనా చేయవచ్చు కానీ.. అన్న క్యాంటీన్లు మూసేయడాన్ని తెలుగుదేశం సహించలేకపోతోంది. ఇవాళ అన్న క్యాంటీన్ల వద్ద నిరసన దీక్షలు చేపడుతున్నాం. మళ్లీ తెరిచేవరకు ఉద్యమిద్దాం" ---చంద్రబాబు నాయుడు
అన్న క్యాంటీన్లు తెరిచేవరకూ ఉద్యమిస్తాం: చంద్రబాబు
ఇవీ చదవండి..