chandrababu letter to pm modi : బీసీ జనగణన చేపట్టాలని ప్రధానికి చంద్రబాబు లేఖ - బీసీ జనగణన వార్తలు
13:09 October 19
ప్రధాని మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ
బీసీ జన గణన చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ(chandrababu letter to pm modi) రాశారు. బీసీలకు సంబంధించిన సరైన సమాచారం లేకపోవటంతో ఆయా వర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా... బీసీలు అన్ని రకాలుగా వెనకబడే ఉంటున్నారని అన్నారు. బీసీ జనగణన పక్కాగా జరిగితేనే బీసీలకు సంక్షేమ ఫలాలు అందుతాయని స్పష్టం చేశారు.
భారతదేశంలో అత్యధిక జనాభా బీసీలు ఉన్నారన్న చంద్రబాబు(chandrababu)... 1953లో మొదటి బీసీ కమిషన్, కాలేల్కర్ కమిషన్, తర్వాతి కమిషన్లు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో సహా, జనగణనలో బీసీ గణనను సిఫార్సు చేశాయని గుర్తు చేశారు. బీసీల ప్రాతినిధ్యం నిష్పత్తిని అర్థం చేసుకునేందుకు జనగణన ఎంతో అవసరమన్నారు. బీసీ జన గణన చేపట్టాలని గత తెదేపా ప్రభుత్వ హయాంలోనే అసెంబ్లీలో ఏకగ్రీన తీర్మానం చేసి.. కేంద్రానికి పంపిందని గుర్తు చేశారు. కులాల వారీగా అందుబాటులో ఉన్న జనగణన వివరాలు 90 ఏళ్ల క్రితం నాటిదన్న చంద్రబాబు.. అది ఇప్పుడు ఏరకంగానూ ఉపయోగపడేలా లేదని అభిప్రాయపడ్డారు. బీసీల సంక్షేమం, అభివృద్ధిని నిర్ధారించడానికి వారి కుల గణనను జనాభా గణనలో చేర్చాలని కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి:Nakka Anandbabu: నక్కా ఆనంద్‌బాబు ఇంటికి మరోసారి పోలీసులు...