ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తుళ్లూరులో రైతుల ఆందోళనకు తెదేపా, సీపీఐ మద్దతు

తూళ్లూరులో అమరావతి రైతుల ఆందోళనకు తెదేపా, సీపీఐ మద్దతు తెలిపింది. రైతులపై రాళ్ల దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల శిబిరాన్ని తొలగించాలన్నారు.

Tdp and CPI support farmers' agitation in Tulluru
తుళ్లూరులో రైతుల ఆందోళనకు తెదేపా, సీపీఐ మద్దతు

By

Published : Dec 7, 2020, 3:22 PM IST

ఉద్దండరాయునిపాలెంలో రైతుల దీక్షా శిబిరంపై రాళ్ల దాడిని తెలుగుదేశం పార్టీ, సీపీఐ తీవ్రంగా ఖండించాయి. తుళ్లూరులో ఆందోళన కొనసాగిస్తున్న మహిళలు, రైతులకు సంఘీభావం తెలిపాయి. మూడు రాజధానుల పేరుతో.. ప్రభుత్వం పోటీ ఉద్యమాలకు తావిస్తూ ఉద్రిక్త పరిస్థితి కల్పిస్తోందని తెలుగుదేశం పార్టీ నేత నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్లతో దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

అమరావతి నుంచి రాజధాని తరలించాలని ప్రభుత్వ ఆలోచనకు కోర్టులో ఎదురుదెబ్బ తప్పదని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రైతులపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే మూడు రాజధానుల శిబిరాన్ని తొలగించాలన్నారు. అమరావతి ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు.

తుళ్లూరులో రైతుల ఆందోళనకు తెదేపా, సీపీఐ మద్దతు

ABOUT THE AUTHOR

...view details