ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'శాసన మండలి రద్దు అంత తేలిక కాదు' - టీడీఎల్పీ సమావేశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన..  గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో తెదేపా శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది. అంతకుముందు శాసనమండలి రద్దు ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించిన నేపథ్యంలో.. తెదేపా నేతలు మాట్లాడారు.

tdlp meeting
టీడీఎల్పీ సమావేశం

By

Published : Jan 27, 2020, 12:21 PM IST

మండలి రద్దుపై టీడీఎల్పీ సమావేశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన.. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో తెదేపా శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు నేతలతో చర్చలు జరుపుతున్నారు. మండలి రద్దుపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చిస్తున్నారు. అంతకుముందు శాసనమండలి రద్దు ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించిన నేపథ్యంలో.. తెదేపా నేతలు మాట్లాడారు. మండలి రద్దు అంత సులభమైన ప్రక్రియ కాదని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రప్రభుత్వం చేతుల్లో లేదు

శాసన మండలి రద్దు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదని ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అన్నారు. తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిన తర్వాత రద్దు ప్రక్రియ పూర్తవడానికి కనీసం 2 సంవత్సరాలు పడుతుందని తెలిపారు. అప్పటివరకు శాసన మండలి కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక పనులపై మండలిలో తెదేపా పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

ఆ నిర్ణయంపై ఆశ్చర్యం లేదు

అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి జగన్​మోహన్ రెడ్డి నిర్ణయాలన్నీ ప్రజా వ్యతిరేకంగానే ఉన్నాయని.. ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. మంత్రిమండలి, శాసనసభకు.. శాసనమండలిని రద్దు చేసే అధికారం లేదన్నారు. అది కేంద్రం చేతుల్లో ఉంటుందని.. ఇప్పటికే కేంద్రం వద్ద పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయనీ.. మండలి రద్దు బిల్లుపై నిర్ణయం తీసుకునేందుకు చాలా సమయం పడుతుందన్నారు.

సుదీర్ఘ ప్రక్రియ ఉంది

ముఖ్యమంత్రి జగన్ మొదటినుంచి రాష్ట్రాన్ని నష్టపరిచే నిర్ణయాలే తీసుకుంటున్నారని... తెదేపా నేత చినరాజప్ప అన్నారు. వీరు నిర్ణయం తీసుకున్నంత మాత్రాన శాసనమండలి రద్దవదని.. దానికి సుదీర్ఘ ప్రక్రియ అవసరమవుతుందన్నారు.

ఇవీ చదవండి:

శాసన మండలి రద్దుకు మంత్రి వర్గం ప్రతిపాదన

ABOUT THE AUTHOR

...view details