- టపాసులను వేడి తగలని ప్రదేశంలో ఉంచాలి. పిల్లలు, పెంపుడు జంతువులకు అందనిచోట పెట్టాలి.
- టపాసులు కాల్చేటప్పుడు కాటన్ బట్టలు ధరించాలి. పొడవైన, వదులుగా ఉన్న దుస్తులు సురక్షితం కాదు.
- ఒక్క టపాసును ఒకసారే వెలిగించండి. అన్నీ ఒకేసారి వెలిగిస్తే ప్రమాదం జరగొచ్చు.
- టపాసులను కాల్చేటప్పుడు పిల్లలను దూరంగా ఉంచండి. పిల్లలు కాల్చేటపుడు పెద్దలు పక్కన ఉంటే మంచింది.
జాగ్రత్త: టపాసుల ధ్వని 85 డెసిబుల్స్ కంటే ఎక్కువ. అది మీ లోపలి చెవికి హాని కలిగించొచ్చు. అవసరమైతే.. ధ్వనిని నియంత్రించే పరికరాలను వాడండి. ఒక పొడవాటి మఫ్లర్ను చెవుల పైనుంచి తలకు చుట్టండి.
- టపాసులు వెలిగించేటపుడు పొడవైన కేండిల్ను ఉపయోగించండి.
- మీకు - టపాసుకు మధ్య దూరం ఉంటే మంచింది.
- టపాసులు కాల్చేటప్పుడు నీటిని దగ్గర ఉంచుకోండి.. ఏదైనా ప్రమాదం జరిగితే ఉపయోగించొచ్చు.