ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. నిమ్మగడ్డ అఫిడవిట్‌పై రీజాయిండర్ దాఖలుకు ఏపీ ప్రభుత్వం లేఖ ద్వారా నాలుగు వారాల గడువును కోరింది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం విచారణ వాయిదా వేసింది.
నిమ్మగడ్డను తిరిగి ఎస్ఈసీగా నియమిస్తూ.. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఇందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ విషయంలో తమకు ఏం జరుగుతుందో తెలుసంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేశ్‌ను తిరిగి ఎస్ఈసీగా నియమించింది.