కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు విధించిన లాక్‌డౌన్ వల్ల రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్న పారిశ్రామిక, తయారీ రంగాలను ఆర్థిక ప్రోత్సాహకాలిచ్చి ఆదుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్ గురువారం 11 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. రుణాల చెల్లింపులు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) మొదలు.. ఎగుమతి ఆధారిత వ్యాపార యూనిట్ల వరకు ఏడు ముఖ్యమైన పారిశ్రామిక విభాగాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని విపులంగా ప్రస్తావించారు. వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అవసరమో వివరించారు. వ్యాపార, ఎగుమతి ఆంక్షల వల్ల చాలా పరిశ్రమల్లో ఉత్పత్తుల నిల్వలు పేరుకుపోయాయన్నారు. మార్కెట్లు మూతపడటంతో పరిశ్రమల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని పేర్కొన్నారు. ‘2018-19లో రాష్ట్ర జీవీఏలో తయారీ రంగం వాటా రూ.72,523 కోట్లు. రాష్ట్రం నుంచి జరిగిన ఎగుమతుల విలువ రూ.98,983 కోట్లు. దీన్ని బట్టే దేశ తయారీ రంగంలోనూ, ఎగుమతుల్లోనూ ఆంధ్రప్రదేశ్‌ది కీలకపాత్ర అని అర్ధమవుతుంది. కరోనా ప్రభావంతో తయారీ రంగం కుదేలైంది. మళ్లీ నిలదొక్కుకోవాలంటే కేంద్రం చేయూతనివ్వాలి’ అని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు.
లేఖలో ప్రధానికి చేసిన విజ్ఞప్తులివీ..
ఎంఎస్‌ఎంఈలు
వేతన బకాయిలు చెల్లించేందుకు అదనపు నగదు లభ్యత కోసం ప్రత్యేకనిధిని ఏర్పాటు చేయాలి. పీఎఫ్, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీల చెల్లింపుపై ఆరు నెలలు మారటోరియం విధించాలి. ఈఎంఐలు, వడ్డీ చెల్లింపులపై ఆర్‌బీఐ ఇచ్చిన మూడు నెలల వాయిదాను పొడిగించాలి. ఎంఎస్‌ఎంఈలకు కేంద్ర సంస్థలు చెల్లించాల్సిన బకాయిలువిడుదల చేయాలి. యూనిట్లు మూతపడ్డ సమయంలో విద్యుత్ సంస్థలు విధించిన ‘మినిమం డిమాండ్ ఛార్జీ’లను రద్దు చేయాలి.
వస్త్ర పరిశ్రమ
బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించాలి. బ్యాంకు రుణాల అసలు, వడ్డీ చెల్లింపుపై ఎంఎస్‌ఎంఈలకు ఆర్బీఐ ఇచ్చిన వెసులుబాటును ఈ రంగానికీ వర్తింపజేయాలి. స్పిన్నింగ్ రంగంలో లక్షలాది మంది ఉపాధి కోల్పోకుండా ఉండాలంటే.. నూలు, వస్త్రాల్ని రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్, ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీం, మర్కండైజ్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రం ఇండియా పథకాల పరిధిలోకి తేవాలి. ముడిసరకు, రంగులు, రసాయనాలు, విడిభాగాలపై యాంటీ డంపింగ్ డ్యూటీ, బేసిక్ కస్టమ్స్ డ్యూటీలను రద్దు చేయాలి.
వాహన, విడిభాగాల తయారీ రంగం
కొత్త వాహనాలపై జీఎస్టీ తగ్గించాలి. జీఎస్టీ చెల్లింపులు వాయిదా వేయాలి. బీఎస్-6 గడువు ఆరు నెలలు పొడిగించాలి. వాహనాల ఆన్‌లైన్ విక్రయాల్ని ప్రోత్సహించాలి. దిగుమతి ఆధారిత కంపెనీల టర్మ్ లోన్స్‌పై మారటోరియం పెట్టాలి. పోర్టు వెయిటింగ్ ఛార్జీలను తిరిగి చెల్లించాలి లేదా రద్దు చేయాలి.
ఔషధ తయారీ రంగం