Knee Replacement Surgery: హైదరాబాద్‌లో రోబోటిక్ విధానం ద్వారా ఓ రోగికి మోకీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సను యశోద ఆసుపత్రికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ టి. దశరథ రామిరెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. పాత విధానంలో పెద్ద కోత పెట్టడంతోపాటు నొప్పి, రక్తం కోల్పోవడం, కోలుకునేందుకు ఎక్కువ రోజులు పట్టేదన్నారు డాక్టర్ టి. దశరథ రామిరెడ్డి. తాజాగా రోబోటిక్ విధానం ద్వారా అవసరమైన మేరకే కోతతోపాటు రోగికి అతి స్వల్ప నొప్పి మాత్రమే ఉంటుందని తెలిపారు. రోబో సహకారంతో మానిటర్‌పై చూస్తూ సర్జరీ చేయడం వల్ల కచ్చితమైన ప్రమాణాలు పాటించడానికి వీలవుతుందన్నారు.
ఇకపై సులువుగా రోబోటిక్ విధానంలో మోకీళ్ల మార్పిడి - yashoda hospital
Robotic Knee Replacement Surgery మోకీళ్ల శస్త్ర చికిత్సను రోబోటిక్ విధానంలో విజయవంతంగా చేశారు యశోద ఆసుపత్రి వైద్యులు. ఈ విధానంలో రోగి త్వరగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ టి. దశరథ రామిరెడ్డి తెలిపారు.
యశోద ఆసుపత్రిలో రోబోటిక్ విధానంలో మోకీళ్ల శస్త్ర చికిత్స