ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైఎస్ షర్మిలతో విద్యార్థి సంఘాల భేటీ - ఫీజు రీయింబర్స్‌మెంట్

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై పలు విద్యార్థి సంఘాలు వైఎస్ షర్మిలతో భేటీ అయ్యాయి. ఫీజు మంజూరు కాక అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తమ సమస్యలు విన్నవించారు.

ys sharmila
వైఎస్ షర్మిలతో విద్యార్థి సంఘాల భేటీ

By

Published : Feb 24, 2021, 9:02 PM IST

స్వర్గీయ వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కాకపోవడంతో తెలంగాణలో పలువురు ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులు షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక.. విద్యార్థులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారని వివరించారు. హైదరాబాద్​లోని లోటస్‌పాండ్‌లో పలువురు విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు షర్మిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను షర్మిలకు వివరించారు. విద్యార్థులు తెలిపిన అభిప్రాయాలను షర్మిల ఆలకించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్‌ఆర్​సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు విశ్వనాథ్‌ చారి, ఓయూ విద్యార్థులు నవీన్ యాదవ్‌, గడ్డం అశోక్, చక్రవర్తి, క్రాంతి, అశోక్‌ యాదవ్‌లతో పాటు ఇతర కాలేజీల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details