ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డేటింగ్‌ యాప్‌ లింకు నొక్కిన పాపం.. రెండేళ్లుగా నరకయాతన - Cyberabad Cybercrime

young man is a victim of dating app sin డేటింగ్‌ యాప్‌ లింకు నొక్కిన పాపం ఓ ప్రైవేటు ఉద్యోగిని రెండేళ్లు వెంటాడింది. మాటలతో నమ్మించి నగ్న చిత్రాలు సేకరించిన సైబర్‌ నేరగాళ్లు అతన్నుంచి రూ.2.18 లక్షలు గుంజారు. వ్యభిచార వెబ్‌సైట్లలో అతని ఫోన్‌ నంబరు ఉంచారు. బాధితుడు సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేశారు.

dating app
డేటింగ్‌ యాప్‌

By

Published : Sep 5, 2022, 12:52 PM IST

young man is a victim of dating app sin: హైదరాబాద్​మియాపూర్‌లోని మయూర్‌నగర్‌లో ఉండే వ్యక్తి(32) 2020 ఆగస్టులో ఆన్‌లైన్‌లో ‘‘లొకాంటో’’ పేరుతో ఉన్న డేటింగ్‌ యాప్‌ లింకు నొక్కాడు. శృతి పేరుతో సైబర్‌ నేరగాళ్లు చాటింగ్‌ ప్రారంభించారు. శృతి, మోక్ష పేర్లతో మభ్యపెట్టి నగ్నచిత్రాలు సేకరించి బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నగ్నచిత్రాల స్క్రీన్‌షాట్లు భార్య, కుటుంబ సభ్యులు, బంధువులకు పంపిస్తామని, నేరుగా ఇంటికొస్తామంటూ ఫోన్లు చేశారు. కుటుంబాన్ని చంపేస్తామంటూ భయపెట్టారు. ప్రతిసారీ కొత్త నంబరు నుంచి ఫోన్‌ చేసేవారు. 70-100 వేర్వేరు నంబర్లతో వేధించారు.

అతని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను హ్యాక్‌ చేసి స్నేహితుల ఫోన్‌ నంబర్లు, ఇతర వివరాలు సేకరించి వారికి వ్యక్తిగత సమాచారాన్ని పంపారు. అంతటితో ఆగకుండా ఫోన్‌ నంబరును వ్యభిచారానికి సంబంధించిన వెబ్‌సైట్లలో ఉంచారు. దీంతో ఫోన్లు పెరిగాయి. లోన్‌యాప్‌ల నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించాలంటూ కొందరు ఫోన్‌ చేసి డిమాండ్‌ చేశారు. గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎమ్‌, బ్యాంకు ఖాతాల ద్వారా మూడు దఫాలుగా మొత్తం రూ.2.18 లక్షలు గుంజారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details