నాలుగు దశల పల్లెపోరులో చివరి విడత పోలింగ్ రేపు జరగనుంది. 13 జిల్లాల పరిధిలోని 161 మండలాల్లో 3,299 పంచాయతీలు, 33,435 వార్డుల్లో నాల్గో విడత ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 553 పంచాయతీలు, 10,921 వార్డులు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 2,744 పంచాయతీలు, 22,422 వార్డులకు రేపు ఉదయం పోలింగ్ జరగనుంది. ఆదివారం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 2,743 పంచాయతీస్థానాలకు 7,475 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 22,422 వార్డు స్థానాలకు 52,700 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
మొత్తం 67,75,226 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. నాలుగో విడతలో 28,995 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6,047 సమస్యాత్మక, 4,967 అతి సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారు. నాలుగో విడతలో 53,282 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, పత్రాలతో ఆయా గ్రామాలకు ఈ రాత్రికే చేరుకోనున్నారు.
భద్రతా చర్యలు చేపట్టిన ఎస్ఈసీ..
నాలుగోవిడత ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాలను ఇప్పటికే గుర్తించిన ఎస్ఈసీ తదననుగుణంగా భద్రతా చర్యలు చేపట్టింది. ప్రధానంగా కడప జిల్లాలో ఎక్కువ శాతం ఏకగ్రీవాలైనా... పోటీ అనివార్యమైన చోట ఉద్రిక్తతలు తలెత్తకుండా జాగ్రత్త తీసుకుంటోంది. సీఎం సొంత నియజకవర్గం పులివెందులలో 109 పంచాయతీలకు గాను 88 ఏకగ్రీవంకాగా మిగిలిన 21 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. సింహాద్రిపురం మండలం కసనూరు, సింహాద్రిపురం, గురజాల, చవ్వారిపల్లి, రావులకొలను పైడిపాలెం, నంద్యాలంపల్లి, లోమడ, లింగాల మండలం కోమన్నూతల, లోపట్నూతల, బోనాల, అంకెవారిపల్లి, పెద్దకుడాల, వెలిదండ్ల పంచాయతీల్లో పోటీ తీవ్రంగా ఉంది.
ఆ స్థానాల్లో ఆధిపత్య పోరు..