రేపు రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈ పథకం నిమిత్తం ప్రభుత్వం రూ.1421.20 కోట్లు విడుదల చేసింది. గ్రామ, వార్డు కార్యదర్శుల ఖాతాల్లోకి సొమ్ము జమ చేసింది. పింఛన్లను 2,37,615 మంది వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసేలా కసరత్తు పూర్తి చేసింది.
కరోనా నియంత్రణలో భాగంగా ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకొచ్చింది. బయోమెట్రిక్ బదులుగా పింఛన్‌దారుల ఫొటోల జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించింది. లాక్‌డౌన్‌తో ఇతర ప్రాంతాల్లో ఉన్నవారికి పోర్టబులిటీ ద్వారా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది.