ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NITI AYOG : "రాష్ట్రానికి.. ఆ నిధులు వచ్చేలా చూడండి" - NITI Aayog

రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు, నిధుల అంశాలపై ఢిల్లీలో నీతి ఆయోగ్ సలహాదారు అవినాశ్ మిశ్రాతో జలవనరుల శాఖ అధికారులు సమావేశమయ్యారు.

NITI AYOG
రాష్ట్రానికి పి ఎం కె ఎస్ వై నిధులు వచ్చేలా చూడండి

By

Published : Oct 27, 2021, 7:54 PM IST

రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు-నిధుల అంశాలపై.. నీతి ఆయోగ్ సలహాదారు అవినాశ్ మిశ్రాతో జలవనరుల శాఖ అధికారులు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన వివిధ ప్రాజెక్టుల డీపీఆర్ ప్రతులను నీతి ఆయోగ్ సలదాహరుకు అధికారులు సమర్పించారు.

ప్రధానమంత్రి కృషి సీంచాయి యోజనతోపాటు ఏడీబీ బ్యాంకు నుంచి కూడా నిధులు వచ్చేలా సహకరించాలని ఏపీ అధికారులు నీతి ఆయోగ్ సలహాదారును కోరారు. మరోవైపు ప్రాజెక్టుల డీపీఆర్​లను కేంద్ర జలశక్తి శాఖతోపాటు కేంద్ర జలసంఘం ఆమోదం కోసం పంపించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ అధికారులు విన్నవించారు.

ఇదీ చదవండి : CM Jagan: పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలి: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details