ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'పూర్తిస్థాయిలో నమూనాల నిర్ధరణ జరుగుతోంది'

By

Published : Apr 1, 2020, 8:54 PM IST

రాష్ట్రంలో నియమావళి ప్రకారం నమూనాలు సేకరించి.. పరీక్షిస్తున్నామని వైద్యారోగ్యశాఖ రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ నోడల్ అధికారి డాక్టర్ కె.రాంబాబు అన్నారు. నమూనాలు తక్కువగా సేకరిస్తున్నామన్న మాటలు అవాస్తవమని స్పష్టం చేశారు.

state health nodal officer on corona testing
కరోనా పరీక్షలపై నోడల్​ అధికారి

కరోనా పరీక్షలపై నోడల్​ అధికారి

రాష్ట్రంలో కరోనా వైరస్ అనుమానితులకు సంబంధించిన నమూనాలు తక్కువగా సేకరిస్తున్నామన్న అంశం వాస్తవం కాదని వైద్యారోగ్యశాఖ రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ నోడల్ అధికారి డాక్టర్ కె.రాంబాబు అన్నారు. ముందుగా కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన ప్రోటో కాల్ ప్రకారం చైనా నుంచి తిరిగివచ్చిన వారి నమూనాలు మాత్రమే తీసుకున్నామని.. ఆ తదుపరి మిగతా దేశాల నుంచి తిరిగి వచ్చిన వారివీ సేకరించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని నాలుగు వీడీఆర్ఎల్ ల్యాబ్​లలో పూర్తిస్తాయిలో నమూనాల నిర్ధరణ జరుగుతోందని వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ఎవరికి వారు స్వీయజాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని రాంబాబు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details