ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం... 6 నెలలు ఎస్మా

state-govt-declared-esma-for-6-months
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం... 6 నెలలు ఎస్మా

By

Published : Apr 3, 2020, 6:38 PM IST

Updated : Apr 3, 2020, 8:34 PM IST

18:29 April 03

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం... 6 నెలలు ఎస్మా

రాష్ట్ర ప్రభుత్వం వైద్య సర్వీసులను ఎస్మా పరిధిలోకి తెస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులను ఆరు నెలల పాటు తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చట్టాన్ని నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో పేర్కొంది. ఎస్మా పరిధిలోకి వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సేవల్లోని పారిశుద్ధ్య సిబ్బంది వస్తారని ఉత్తర్వుల్లో తెలిపింది. ఎస్మా పరిధిలోకి వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణాను కూడా తీసుకొచ్చారు. మందుల కొనుగోలు, రవాణా, తయారీ, అంబులెన్స్‌ సర్వీసులు, మంచినీరు, విద్యుత్‌ సరఫరా, భద్రత, ఆహార సరఫరా, బయో మెడికల్‌ వ్యర్థాలను ప్రభుత్వం ఈ చట్టం పరిధిలోకి తెచ్చింది.

ప్రజా శ్రేయస్సు కోసమే

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజారోగ్యం, శ్రేయస్సు దృష్ట్యా వైద్యారోగ్య సేవలను ఎస్మా పరిధిలోకి తెచ్చినట్లు మంత్రి బొత్స తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

కరోనా నుంచి కోలుకున్నాడు.. అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు!

Last Updated : Apr 3, 2020, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details