YSR AWARDS : 2022 ఏడాదికి వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కళా రంగం నుంచి కళాతపస్వి కె. విశ్వనాథ్, అర్.నారాయణ మూర్తికి.. లైఫ్ టైం అచీవ్‌మెంట్ పురస్కారాలను ఇవ్వనున్నట్లు తెలిపింది. వైద్య రంగంలో శాంతా బయోటెక్, అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సి.ప్రతాప్‌రెడ్డి, ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రికి.. వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డులు ఇవ్వనున్నారు. భారత్ బయోటెక్ కృష్ణా ఎల్లా, సుచిత్ర ఎల్లాలకు వైఎస్సార్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. పారిశ్రామిక రంగం నుంచి గ్రంథి మల్లిఖార్జున రావుకు వైఎస్సార్ అవార్డు అందిస్తారు.
రంగస్థలం నుంచి నాయుడు గోపికి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, ఎమెస్కో విజయ్‌కుమార్‌కు.. వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులు ప్రకటించింది. దిశ యాప్ ద్వారా సత్వరం స్పందించి మహిళను కాపాడిన ఐదుగురు పోలీస్‌లకు ఉమ్మడిగా వైఎస్సార్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని అందించనున్నారు. అవార్డు కింద రూ.5 లక్షలు, లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు కింద రూ.10 లక్షల నగదును ఇవ్వనున్నారు. నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
విభాగాల వారిగా అవార్డులు..
వ్యవసాయం.. వైయస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డులు
1) ఆదివాసీ కేష్యూనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ: సోడెం ముక్కయ్య, బుట్టాయగూడెం, ఏలూరు జిల్లా.
2) కుశలవ కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ: ఎ.గోపాలకృష్ణ, అంబేడ్కర్ కోనసీమ జిల్లా.
3) అన్నమయ్య మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్: జయబ్బనాయుడు, తలుపల గ్రామం, పీలేరు మండలం, అన్నమయ్య జిల్లా
4) అమృత ఫల ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ: కె.ఎల్.ఎన్. మౌక్తిక, సబ్బవరం, అనకాపల్లి జిల్లా.