రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటయ్యాక ఎన్నికలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 ‘స్థానిక’ ఎన్నికల్లో వరదల వల్ల పోలింగ్ నిర్వహించే పరిస్థితి లేదన్న కారణంతో.. ఆదిలాబాద్, తూర్పు గోదావరి, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోని పలు పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా వేశారు.
ఆరు వారాలు వాయిదా వేయడం ఇదే మొదటి సారి - ఏపీ స్థానికి సంస్థల ఎన్నికలు వాయిదా
రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటయ్యాక ఎన్నికలు 6 వారాలు వాయిదా వేస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. సాధారణ ఎన్నికల సందర్భంలో భారత ఎన్నికల సంఘం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పరిపాటి.
ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ఆదివారం మధ్యాహ్నం తరువాత నిలిచిపోయింది. 6 వారాలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ నిర్ణయం తీసుకున్నాక సంబంధిత దస్త్రాన్ని (నోటిఫికేషన్) రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు.. కలెక్టర్లు, జడ్పీ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారి, పుర, నగరపాలక కమిషనర్లకు పంపారు. అత్యధిక జిల్లాల్లో పోలింగ్ సిబ్బందికి ఆదివారం శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. విషయం తెలిసిన వెంటనే వాటిని నిలిపివేసి ఉద్యోగులను వెనక్కి పంపారు. ఎస్ఈసీ నుంచి తదుపరి ఆదేశాలు వెలువడ్డాక చూద్దామని.. అప్పటివరకు ప్రక్రియను నిలిపి వేయాలని కలెక్టర్లు కింది స్థాయి అధికారులకు సూచించారు.
ఇవీ చదవండి:కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి...