కొవిడ్ తర్వాత ప్రతి ఒక్కరు ఆరోగ్యం మీద కాస్త ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఏం తింటున్నాం అనే దానికన్నా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నామా లేదా అనేది ముఖ్యం. చాలా తక్కువ ధరకు దొరికే సిరి ధాన్యాల్లో ఒకటైన రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంతకీ అందులో గుణాలేంటి? దాంతో ఎలాంటి ఆహారం తయారు చేసుకవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
పోషకాలను తాగేయండీ..చాలామందికి ఉదయం టీ, కాఫీ ఏదోటి తాగనిది రోజు మొదలవ్వదు. కానీ వీటికి బదులుగా ఆరోగ్యకరమైన డ్రింక్‌ను డైలీ రొటీన్‌లో చేర్చితే ఎలా ఉంటుంది. అదేంటి అనుకుంటున్నారా! అందరికీ అందుబాటులో ఉండే రాగిమాల్ట్. ఉదయం పూట ఒక గ్లాసు రాగిమాల్ట్ తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.
రాగి ఇడ్లీలు:ఎప్పడు ఒకే విధంగా ఇడ్లీ రవ్వతో ఇడ్లీలు చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి! కాస్త భిన్నంగా మరింత ఆరోగ్యంగా రాగి పిండితో ఇడ్లీలు చేసుకోండి. దీంతో ఇంటిల్లి పాదికి లాభం చేకూరుతుంది.
రాగి సంగటి:తెలుగు రాష్ట్రాల్లో రాగి సంగటి ఎంతో ఫేమస్. దీన్ని ఉదయం అల్పాహారంగా అయినా, మధ్యాహ్నం భోజనంగా అయినా తినవచ్చు.
* రాగి పిండితో దోశలు, లడ్డూలు కూడా చేసుకోవచ్చు. ఎవరి నచ్చిన తీరులో వాళ్లు దీనిని ఆహారంగా తీసుకోవచ్చు. పోషకాలను పొందవచ్చు.