ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 14, 2020, 7:13 AM IST

ETV Bharat / city

అంగీకరిస్తే హైదరాబాద్‌లో ఉన్నవాళ్లు రావొచ్చు!

లాక్​డౌన్ వల్ల హైదరాబాద్​లో చిక్కుకున్న ఏపీకి చెందినవారు రాష్ట్రానికి వచ్చేలా అనుమతులు ఇచ్చింది. అందుకు వీలుగా ప్రత్యేక ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడపనుంది. క్వారంటైన్​లో ఉండేందుకు అంగీకరించిన వారికి మాత్రమే ప్రత్యేక బస్సుల టిక్కెట్లు జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

hydrabad to ap special buses
హైదరాబాద్​ నుంచి రాష్ట్రానికి ప్రత్యేక బస్సులు

లాక్‌డౌన్‌ వల్ల హైదరాబాద్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు వచ్చేందుకు వీలుగా రాష్ట్ర ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నవారికే ఈ బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం కల్పించనున్నారు. స్వస్థలాలకు చేరుకున్న తర్వాత సంబంధిత జిల్లాలో క్వారంటైన్‌ కేంద్రంలో ఉండేందుకు అంగీకరించిన వారికే టిక్కెట్లు జారీ చేస్తారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలంటూ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు.

ఏపీకి వస్తామంటూ హైదరాబాద్‌లో 8 వేల మంది, రంగారెడ్డి జిల్లా పరిధిలో 5 వేల మంది స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 13 వేల మందిని తీసుకొచ్చేందుకు బస్సు సర్వీసులు నడపనున్నారు. ఏసీ బస్సుల్లో గరుడ ఛార్జీ, నాన్‌ ఏసీ బస్సుల్లో సూపర్‌ లగ్జరీ ఛార్జీ తీసుకోనున్నారు. ఈ బస్సులు మియాపూర్‌-బొల్లారం క్రాస్‌రోడ్‌, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్‌, ఎల్బీనగర్‌లలో ప్రయాణికులను ఎక్కించుకున్న తర్వాత మధ్యలో ఎక్కడా ఆగకుండా నేరుగా గమ్యస్థానానికి చేరుకుంటాయి. ముందుగా ఆన్‌లైన్‌ బుకింగ్‌కు అవకాశం ఇస్తారు. ఈ సర్వీసుల్లో కరెంట్‌ బుకింగ్‌ చేసుకునే వీలుండదు.

రెండు, మూడు రోజుల్లో మొదలు

  • ఈ బస్‌ సర్వీసులు రెండు, మూడు రోజుల్లో మొదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. ప్రభుత్వం దీనిపై అధికారికంగా ప్రకటన చేసిన వెంటనే ఆర్టీసీ అధికారులు ఈ-టికెట్‌ బుకింగ్‌కు అవకాశం ఇవ్వనున్నారు.
  • రెండో దశలో బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉండిపోయిన ఏపీకి చెందిన వారినీ తీసుకొచ్చేందుకు సర్వీసులు నడపనున్నారు. బెంగళూరులో 2,700 మంది, చెన్నైలో 1,700 మంది స్పందన పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఏపీ నుంచి వెళ్లే వారికి ఈ సర్వీసుల్లో అవకాశం ఉండదని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

అత్యవసర పనులకు ఈ-పాస్‌

  • అత్యవసర, ముఖ్యమైన పనులపై ప్రయాణించే వారికి పోలీసుశాఖ కొవిడ్‌ 19 పేరుతో ఈ-పాస్‌లు జారీ చేయనుంది. అవసరమైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ కార్యాలయం ఒక ప్రకటనలో సూచించింది.
  • అత్యవసర వైద్యం, కుటుంబంలో మరణం, సామాజిక పనులు, ప్రభుత్వ విధినిర్వహణ పనులపై ప్రయాణించే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిన నేపథ్యంలో.. సీఎం ఆదేశాల మేరకు పాస్‌లు మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.
  • కొవిడ్‌-19 అత్యవసర ఈ-పాస్‌కు దరఖాస్తు చేసుకునే చిరునామా https: citizen.appolice.gov.in
  • ఈ-పాస్‌ కోసం ఇచ్చిన వివరాలను ఆమోదిస్తే.. వాహన అత్యవసర ఈ-పాస్‌ను దరఖాస్తు చేసుకున్న వారి మొబైల్‌, మెయిల్‌ ఐడీకి పంపిస్తారు.

ఇదీ చదవండి:

'12 మంది వైరస్ బాధితులు... వలస కూలీలే'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details