ఎస్సీ, ఎస్టీ సంక్షేమ బిల్లుపై అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. దీనిపై అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతుండగానే... తెలుగుదేశం నేతలు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అమరావతి ప్రాంతంలో నిన్న జరిగిన దౌర్జన్యకాండను ఖండిస్తూ సభాపతి పోడియాన్ని చుట్టుముట్టారు. ఈ గందరగోళంలోనే సభలో గందరగోళం నెలకొంది. తెలుగుదేశం సభ్యుల వైఖరితో మనస్థాపానికి గురయ్యానని సీటు నుంచి లేచి వెళ్లిపోయారు.
'నేను మనస్థాపానికి గురయ్యా... వెళ్లిపోతున్నా....' - thammieneni sitharam on tdp protest in assembly news
మంత్రి పినిపె విశ్వరూప్ ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ బిల్లుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. తెదేపా సభ్యులు జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ సభాపతి పోడియాన్ని చుట్టు ముట్టారు. దీనిపై స్పీకర్ అసహనం వ్యక్తం చేసి... సభ నుంచి లేచి వెళ్లిపోయారు.
ఐ యామ్ హర్ట్: నేను వెళ్లిపోతున్నా