ప్రతి 50 ఇళ్లకూ ఒక వాలంటీర్‌ను నియమించి ప్రభుత్వ పథకాలతో పాటు పాలనను గ్రామాల్లోకి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం రామచంద్రపురం, సైలాడ గ్రామాల్లో పర్యటించిన ఆయన.... అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. క్యాష్ ట్రాన్స్ఫర్ సిస్టం భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అమల్లో ఉందన్నారు.
గ్రామాల్లో యువతకి ఉద్యోగం కల్పించి ఉద్యోగ విప్లవాన్ని ముఖ్యమంత్రి జగన్ సృష్టించారన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకొచ్చాయని మండిపడ్డారు.