ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పలు శాఖల అధికారులపై స్పీకర్ తమ్మినేని తీవ్ర ఆగ్రహం

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలో పర్యటించిన స్పీకర్ తమ్మినేని సీతారాం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించటంలో అధికారులు నిర్లక్ష్యం వహించటంపై మండిపడ్డారు. ప్రజల క్షేమం కోసం అధికారులంతా బాధ్యతగా పని చేయాలని సూచించారు.

speaker tammineni
speaker tammineni

By

Published : Nov 7, 2020, 9:33 PM IST

పలు శాఖల అధికారులపై స్పీకర్ తమ్మినేని తీవ్ర ఆగ్రహం

పలు శాఖలకు చెందిన అధికారుల పనితీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం ఇసుకపేట, పెద్ద వెంకటాపురం గ్రామాల్లో ఆయన పర్యటించారు. పెద్ద వెంకటాపురంలో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామసభలో మాట్లాడారు. సరుబుజ్జిలి మండల పరిధిలో వివిధ గ్రామాల్లో విద్యుత్ శాఖ అధికారులు సక్రమంగా పని చేయడం లేదని పలువురు స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సంబంధిత శాఖ అధికారులను పిలిచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మండలానికి మరోసారి వచ్చే నాటికి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

మండల పరిధిలో ఇటీవల ఓ ఆధార్ సెంటర్ ద్వారా అవినీతి జరిగిందని...నిర్వాహకులపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఆధార్ సెంటర్​పై ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రత్యేకాధికారితో పాటు ఎంపీడీవోలను ప్రశ్నించారు. పశు సంవర్ధక శాఖ అధికారులు కూడా తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రజల క్షేమం కోసం అన్ని శాఖల అధికారులు బాధ్యతగా పని చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details