ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విషాదం: ఒకే రోజు తండ్రి, కుమారుడు మృతి - మెదక్ జిల్లాలో విషాదం

తెలంగాణలోని మెదక్ జిల్లా పడాలపల్లిలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో ఒకే రోజు తండ్రి, కుమారుడు మృతి చెందారు. తూప్రాన్‌ పురపాలిక పరిధిలో ఈ ఘటన జరిగింది.

died persons
మరణించిన వ్యక్తులు

By

Published : May 9, 2021, 9:58 PM IST

కొవిడ్ మహమ్మారి ఆ కుటుంబంలో అంతులేని విషాదం నింపింది. మెదక్ జిల్లా తూప్రాన్‌ పురపాలక పరిధిలోని పడాలపల్లిలో అనారోగ్యంతో తండ్రి, కొడుకు మృతి చెందారు. ఈ ఇద్దరి మరణంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

గ్రామానికి చెందిన కానుకుంట యాదయ్య (65) అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే మృత్యువాత పడ్డాడు. శ్వాసకోస సంబంధిత సమస్యతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని కుమారుడు కృష్ణ (35) తండ్రి మరణించిన గంటసేపటికే మృతి చెందాడు. కేవలం గంట వ్యవధిలో ఇద్దరూ మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పడాలపల్లిలో కౌన్సిలర్ అరుణ వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఇదీ చూడండి:కొవిడ్​కు గర్భిణి బలి.. ఆక్సిజన్ అందట్లేదని అంతకుముందు సెల్ఫీవీడియో!

ABOUT THE AUTHOR

...view details