ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సీఎం రాజధానికి కొత్త నిర్వచనం ఇస్తున్నారు' - three capital issue news

సీఎం జగన్‌ రాజధానికి కొత్త నిర్వచనం చెబుతున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి విమర్శించారు. సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధానంటున్నారని ట్వీట్​ చేశారు.

somi reddy on three capital issue
మూడు రాజధానులపై సోమిరెడ్డి

By

Published : Jan 24, 2020, 3:15 PM IST

మూడు రాజధానులపై సోమిరెడ్డి ట్వీట్​
మూడు రాజధానులపై సోమిరెడ్డి ట్వీట్​

సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధానంటున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి ఆరోపించారు. జగన్​ తీరు చూస్తుంటే ఆయన వెనుకే అధికారులంతా గుడారాలేసుకుంటే సరిపోతుందని ట్వీట్​ చేశారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదన్నట్లు ముఖ్యమంత్రి చెబుతున్నారని... ఈ అంశాన్ని ప్రస్తావించకుండా అంబేడ్కర్ పొరపాటు చేశారేమో అని ఎద్దేవా చేశారు. జగన్​ రాజధానికి కొత్త నిర్వచనం చెబుతున్నారని వ్యాఖ్యానించారు. జయలలిత ఊటీ నుంచి పాలన సాగించారంటున్నారని.. మన రాష్ట్రంలో సైతం హార్స్‌లీ హిల్స్, అరకు నుంచి పాలన సాగించుకోవచ్చన్నారు.

ABOUT THE AUTHOR

...view details